Showing posts with label State Government Jobs. Show all posts
Showing posts with label State Government Jobs. Show all posts

Tuesday, September 22, 2015

TSPSC 3,896 కొత్త పోస్టులు

IR



త్వరలో నాలుగువేలకు పైగా పోస్టుల భర్తీ
-ఐఆర్ బెటాలియన్లలో 3896 పోస్టులు
- గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ
- టీఎస్‌పీఎస్సీ ద్వారా మరో 283 
- నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
-నవంబర్‌లో పరీక్షలు.
ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అలాగే టీఎస్‌పీఎస్సీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలలో మరో 283 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తంగా నాలుగువేల మందికి పైగా నిరుద్యోగులకు త్వరలోనే ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుకానున్న నాలుగు ఇండియన్ రిజర్వు బెటాలియన్ (టీఎస్‌ఎస్పీ)లలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


TSPSCLOGO


ఫలితంగా 3,896 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ నాలుగు బెటాలియన్లలో పోలీస్ కానిస్టేబుళ్లతోపాటు సంబంధిత పోస్టుల నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగ యువతకు తీపి కబురు అందిస్తూ నియామకాలకు సంబంధించి ఫైలుకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు నాలుగు బెటాలియన్లలో 3,896 కొత్త పోస్టులను సృష్టించడంతో పాటు నియామకాలను చేపట్టాలని పేర్కొంది. ఒక్కో బెటాలియన్‌లో 974 పోస్టులుంటాయి. 



వీటిలో కొన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ కానుండగా, మరికొన్ని నియామక ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నట్టు ఆర్థిక శాఖ తన జీవోలో పేర్కొంది. ఇక టీఎస్‌పీఎస్సీ ద్వారా రవాణా, జలమండలి, పురపాలక శాఖలలో 283 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు బుధవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుండగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.


నియామకాలు..ప్రక్రియ


అసిస్టెంట్ కమాండెంట్/డీఎస్పీ హోదా ఉన్న 16 మంది అధికారులను పదోన్నతి ద్వారా లేదా నేరుగా ఎంపిక చేయనున్నారు. అలాగే ఆర్‌ఐ పోస్టులను కూడా నేరుగా లేదా ప్రమోషన్ల ద్వారా నియమించనున్నారు. ఇకపోతే అత్యంత కీలకమైన, క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఒక్కో బెటాలియన్‌లో 633 మంది కానిస్టేబుళ్లను భర్తీ చేయనున్నారు. వీరితోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వంటమనుషులు, ఆఫీస్ సబార్డినేట్లు, దోబీలు, బార్బర్లు, స్వీపర్లను కూడా నేరుగా నియమించున్నారు. మినిస్టీరియల్ స్టాఫ్, కమాండెంట్, అదనపు కమాండెంట్, మెడికల్ స్టాఫ్ తదితర విభాగాల్లో పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

Monday, September 21, 2015

TS Transco Genco 1422 AE Jobs Latest Notification 2015

TS Transco  Genco 1422 AE Jobs Latest Notification 2015.

Job Category:  Assistant Engineer in TS Transco.
AE (Electrical) -184 Posts
TRANSCO AE (Civil)- 22 PostsIn TS Genco
GENCO AE (Electrical) – 419 Posts
GENCO AE (Civil) – 172 Posts
GENCO AE (Electronics) – 70 Posts
GENCO AE (Mechanical) – 195 Posts in SPDCL and NPDCL
SPDCL – 201 Posts
NPDCL – 159 Posts
Total AE (Electrical) : 962 Posts
Number of Posts: 1422
Location: Telangana
Education Qualification: The Candidates need to  have the qualifications as mentioned by the organization for each and every Posts
Age Limit: Minimum of 18 Years and Maximum of 35 Years
Pay Scale: Refer the Official  Notification
Selection Criteria: Written Examination and Interview
Application Fee: As per the Norms of the Organization.
TSPSC AE Online Application Form 2015
How to Apply : Through Online Mode only
Important Dates:
NPDCL Exam Date: 8th November 2015
GENCO Exam Date: 14th November 2015
SPDCL Exam Date: 22nd November 2015
TRANSCO Exam Date: 29th November 2015
                  click here to :   Transco Official website
                  click here to TS Genco Official website

Saturday, September 12, 2015

నల్లగొండ కోర్టులో ఉద్యోగాలు






నల్లగొండ కోర్టులో ఉద్యోగాలు

1. స్టెనోగ్రాఫర్స్ పోస్టులు , http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20Steno%20G%20III.pdf

2. టైపిస్ట్ పోస్టులు, http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20TYPISTS.pdf


3. ఎగ్జామినర్ పోస్టులు http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20Examiners.pdf
,
4. జూనియర్ అసిస్టెంట్స్ 20 ఖాళీలు ,http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20JUNIOR%20ASSISTANT.pdf

5. ఆఫీస్ సబార్డినేట్స్ (అటెండర్) పోస్టులు,  http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20Office%20Subordinates.pdf

6. ప్రాసెస్ సర్వర్ పోస్టులు http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20PROCESS%20SERVERS,.pdf

7. ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టులు http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATION-2015,%20Field%20Assitants.pdf

8. కాపీయిస్ట్ పోస్టులు http://ecourts.gov.in/sites/default/files/NOTIFICATIONS-2015,%20COPYISTS.pdf

for more  details
follow the link http://ecourts.gov.in/india/telangana/nalgonda/recruitment

Saturday, August 29, 2015

టీ.ఎస్ .పి .ఎస్సీ రెండో నోటిఫికేషన్ 563 ఏ .ఈ పోస్టులకు విడుదల చేసింది


రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రెండో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ప్రభుత్వశాఖల్లోని 563 మెకానికల్, సివిల్ క్యాటగిరీ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువరించింది. శనివారం ఇచ్చిన ఈ ప్రకటన కమిషన్ వెబ్‌సైట్ (http://tspsc.gov.in)లో నోటిఫికేషన్ నంబరు 09/2015 పేరుతో అందుబాటులో ఉంది. మరోవైపు గ్రూప్స్ 1,2,3,4 పరీక్షల సిలబస్‌ను సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. కాగా రెండో నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 

-మెకానికల్, సివిల్ క్యాటగిరీలో ఖాళీలు
-మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ
-గ్రూప్స్ సిలబస్ ప్రకటన రేపే!

దరఖాస్తులకు చివరి గడువు సెప్టెంబర్ 28గా పేర్కొన్నారు. పరీక్ష ఈ ఏడాది అక్టోబర్ 25న నిర్వహించే అవకాశం ఉంది. వారంరోజుల ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించే ఈ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం-సీబీఆర్‌టీ) లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తిచేయాలి. ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్న విద్యార్హతలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.

TSPSC-LOGO


ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద వంద రూపాయలు, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, ఎక్స్ సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత క్యాటగిరీల వారికి మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగుల కోటాలో ఫీజు మినహాయింపు కోరేవారు తగు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఫీజు మినహాయింపు సహా ఏ రకమైన రిజర్వేషన్లు కూడా వర్తించవు. ఈ పరీక్ష హైదరాబాద్‌లో (హెచ్‌ఎండీఏ పరిధి) మాత్రమే నిర్వహించనున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియలో తదనుగుణంగా విడుదలయ్యే కోర్టుల ఉత్తర్వులు, జీవోలను కమిషన్ పరిగణనలోకి తీసుకొని ప్రక్రియలో తగు మార్పులు చేస్తుందని ఆదేశాల్లో తెలిపారు. ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక రాత/ ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. బీసీ కోటాలో దరఖాస్తు చేసేవారు క్రిమీలేయర్ పరిధి పత్రాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అందజేయాల్సి ఉంటుంది. సందర్భానుసారం వచ్చే ఆదేశాల ఆధారంగా ఖాళీల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. 

1. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)


- గ్రామీణ త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఖాళీలు: 125 
ఓపెన్ కోటా- 36, ఓపెన్ కోటా(స్త్రీ)- 21, బీసీ ఏ-06, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-08, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-01, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-08, బీసీ డీ (మహిళ)-03, బీసీ ఈ-05, బీసీ ఈ (మహిళ)-01, ఎస్సీ-13, ఎస్సీ (మహిళ)-06, ఎస్టీ-05, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 84, మహిళా కోటాలో 41 అన్నీ కలిపి 125 ఖాళీలు ఉన్నాయి.

2. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్)- రోడ్లు, భవనాల శాఖ: 42


ఓపెన్ కోటా- 13, ఓపెన్ కోటా(స్త్రీ)- 06, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-0, బీసీ సీ-0, బీసీ సీ (మహిళ)-0, బీసీ డీ-03, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-03, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-04, ఎస్సీ (మహిళ)-02, ఎస్టీ-00, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-02, పీహెచ్ (మహిళ)-0, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 29, మహిళా కోటాలో 13 అన్నీ కలిపి 42 ఖాళీలు ఉన్నాయి.

3. అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ లేదా మెకానికల్)


-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 258
ఓపెన్ కోటా- 80, ఓపెన్ కోటా(స్త్రీ)- 42, బీసీ ఏ-12, బీసీ ఏ (మహిళ)-06, బీసీ బీ-14, బీసీ బీ (మహిళ)-12, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-01, బీసీ డీ-12, బీసీ డీ (మహిళ)-05, బీసీ ఈ-08, బీసీ ఈ (మహిళ)-03, ఎస్సీ-25, ఎస్సీ (మహిళ)-13, ఎస్టీ-09, ఎస్టీ (మహిళ)-06, పీహెచ్-05, పీహెచ్ (మహిళ)-03, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 167, మహిళా కోటాలో 91 అన్నీ కలిపి 258 ఖాళీలు ఉన్నాయి.

4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్ )


- పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 84
ఓపెన్ కోటా- 23, ఓపెన్ కోటా(స్త్రీ)- 12, బీసీ ఏ-03, బీసీ ఏ (మహిళ)-01, బీసీ బీ-07, బీసీ బీ (మహిళ)-05, బీసీ సీ-00, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-05, బీసీ డీ (మహిళ)-01, బీసీ ఈ-04, బీసీ ఈ (మహిళ)-00, ఎస్సీ-10, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-04, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-03, పీహెచ్ (మహిళ)-00, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 59, మహిళా కోటాలో 25 అన్నీ కలిపి 84 ఖాళీలు ఉన్నాయి.

5. టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్ లేదా మెకానికల్)


-పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ: 54 
ఓపెన్ కోటా-16, ఓపెన్ కోటా(స్త్రీ)- 08, బీసీ ఏ-02, బీసీ ఏ (మహిళ)-02, బీసీ బీ-02, బీసీ బీ (మహిళ)-02, బీసీ సీ-02, బీసీ సీ (మహిళ)-00, బీసీ డీ-00, బీసీ డీ (మహిళ)-02, బీసీ ఈ-00, బీసీ ఈ (మహిళ)-02, ఎస్సీ-06, ఎస్సీ (మహిళ)-04, ఎస్టీ-02, ఎస్టీ (మహిళ)-02, పీహెచ్-00, పీహెచ్ (మహిళ)-02, మొత్తం ఖాళీల్లో జనరల్ కేటగిరీ 30, మహిళా కోటాలో 24 అన్నీ కలిపి 54 ఖాళీలు ఉన్నాయి.

రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన?


టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచింది. ప్రభుత్వం నుంచి అందుతున్న ఖాళీలకు తగినట్లు వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కమిషన్.. తాజాగా గ్రూప్స్ కేటగిరీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్, 1,2,3,4లకు సంబంధించిన కొత్త సిలబస్‌ను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ రేపు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి గ్రూప్స్ సిలబస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని కమిషన్ ఇంతకు ముందే ప్రకటించింది. గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ముందే సిలబస్ ప్రకటిస్తామని కూడా కమిషన్ చెప్పింది.

Wednesday, August 19, 2015

Latest News:15,522 Posts Notification Releassed Today:Govt Jobs


Telangana Public Service Commission TSPSC Vacancies Details:

  • Group 1: 200 vacancies
  • Group 2: 2500 vacancies
  • Gazette: 1000 vacancies
  • non-Gazatte: 1500 vacancies
  • AEE: 1000 vacancies
  • Assistant Engineer : 2500 vacancies.

Application Fee:

If there is any fee applicable then candidates are required to pay the application fee as per the mention process in the notification.

Selection Process:

The selection of the capable job searchers will decide by the commission only, which will be update after official announcement. As per the announcement updates selection process must be written examination, personal interview and physical test.
Like others Public service commission, candidates will be selected based on the performance of candidates in written examination and personal interview.

TSPSC Notification to Fill 4,336 Posts Soon