Saturday, April 30, 2016

ఉత్తములకీ మనకీ తేడా !

చరిత్రలో ఆవిష్క్రతమైన అద్భుత సంఘటన
ఉత్తములకీ మనకీ తేడా !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
జరిగిన కధ ! 
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన ౠసొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు 💥. చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.

Friday, April 29, 2016

ఆఫీసుల్లో కొలీగ్‌లు, బాస్‌లు చేసే రాజకీయాలకు చెక్ పెట్టేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటి..?


ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే? అప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పాడు. వాటిని పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరి, ఆ చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా!
1. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది. దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి. దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే. అలా చేస్తేనే వారిపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
2. మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు, సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
3. ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. అలా చేస్తే దాని వల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దాని వల్ల లబ్ది పొందుతారు.
4. శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్ర్తాలను ప్రయోగిస్తారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
5. శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు.
6. ఎక్కడ, ఏ సందర్భంలోనైనా మనం మంచి నడవడిక, ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం.
7. మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఒక వేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు కనుక, మన విలువైన మాటలు వృథాగా పోతాయి. అంతే తప్ప, పెద్దగా ఫలితం ఉండదు.
8. పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది కానీ మనతో మంచిగా ఉండదు కదా! అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎల్లప్పటికీ చెడే తలపెడతారు. ఎందుకంటే వారికి చెడు చేయడంలోనే తృప్తి లభిస్తుంది.

Tuesday, March 8, 2016

Job...... Jobs.... Jobs....Golden Opportunity

STRATEGIC BUSINESS MANAGEMENT
Landmark Global:
Landmark Global is a SBU of a UK based Marketing MNC. We have delivered hundreds of successful campaigns, and developed considerable expertise in the planning, set up, execution and management of Customer Acquisition, Product Sales & Promotion Campaigns. Job Profile

We select our new joiners as Business Associate and train and develop them holistically on all functional areas of Business Management viz. Sales & Marketing, HR, Finance and Operations.

1. Activity/ Task set: Client Representation and Servicing Functional Areas: Advertising/ Promotion/ Direct Sales/Marketing/Business Development
2. Activity/ Task set: Team Building & Management Functional Areas: Recruiting/ Training/ Development/ Evaluation/ Motivation/ Impact Running
3. Activity/ Task set: Overall Business Management Functional Areas: Administration, Operations, Finance, Applied IT
4. Activity/ Task set: Management of a Strategic Business Unit (SBU) Functional Areas: Operations, Administration, Team Management, Business Strategy

Experience: Not Required

Location: Hyderabad

Number of Vacancies: 139 


for more information Visit Website : www.landmarkglobal.tk

Friday, March 4, 2016

KCR Double Bed Room House in Erravelli

చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది.



మనిషి పుట్టిన తరువాత ఎప్పుడు చనిపోతాడో ఎవరూ చెప్పలేరు. అయితే చనిపోతారని తెలిసిన వ్యక్తుల వద్ద ఉండే వారికి చనిపోయే వారిలో ఏయే లక్షణాలు ఉంటాయో తెలిసేందుకు అవకాశం ఉంది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.
2. చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.
3. మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతోపాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.
4. కొంత మంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.
5. కొంత మంది తమ గదిలో తమతోపాటు యమధర్మ రాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.
6. కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.

Wednesday, March 2, 2016

డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తు చేసుకోవడం ఇలా ... |


డబుల్ బెడ్ రూం  ఇండ్ల  దరఖాస్తు చేసుకోవడం ఇలా ... | 
ఇల్లు లేని నిరుపేదల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన పథకం అయినందున నిజమైన లబ్ధిదారులకే లబ్ది చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
* అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.
* అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.
* ఫారానికి పాస్‌పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్‌సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.
* కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు ఉంటే మంచింది.
* ప్రస్తుత అడ్రస్‌లో ప్లాట్‌నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.
* మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్‌మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
* దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.
* గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.
* మొబైల్ నెంబర్, ఉంటే ఈమేయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్‌లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు. అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.