Thursday, September 1, 2016

ఒక చిన్న కథ!!

ఒక చిన్న కథ!!

వెంగల్ రావు రోజూ దేవుడుని తిట్టడం మెదలుపెట్టాడు.
మా ఇంటి ముందు ఉన్న అప్పారావు గాడు తాపీ పని చెసుకునే వాడు.ఇప్పుడు వాడిని లక్షదికారిని చేసావు.
ఇంటి పక్కనే ఉన్న సుబ్బారావు గాడు సైకిల్ షాపు నడిపేవాడు వాడు కూడా ఈ రోజూ లక్షదికారి అయ్యాడు. వాళ్ళు నీకు ఎప్పుడూ పూజా కాదు కదా కనీసం చెయ్యి ఎత్తి దండం కూడా పెట్టలేదు నేను నీకు రోజూ పూజ చేసి దండం పెడితే నన్ను మాత్రం ఇలాగే బికారి లాగా ఉంచడం నీకు న్యాయంగా ఉందా అని. 
వీడి బాద బరించలేని దేవుడు ఓ రోజూ బిక్షగాడి రూపం లో వచ్చి ఇలా అడిగాడు.
నాయనా ఆకలి గా ఉంది ధర్మం చేయండి బాబూ అన్నాడు అందుకు వెంగల్ నాకే ఏం లేదు నీకు ధర్మం ఏం చేస్తా వెళ్లు అని కసురుకున్నాడు.
అప్పుడు దేవుడు ఇలా అడిగాడు నీకు నీ ఆస్తి ఏం లేదా
వెంగల్ : లేదు ఏం నీవు ఇస్తావా అని వెటకారంగా అడిగాడు
దేవుడు : హా ఇస్తాను కానీ ఊరికే ఇవ్వను
నీ ఓక చెయ్యి కి లక్ష రూపాయలు రెండు చేతులు ఇస్తే 3 లక్షలు ఓ కాలు ఇస్తే రెండు లక్షలు రెండు కాళ్లు ఇస్తే 4 లక్షలు ఇలాగే ప్రతి ఆవయావనికీ రేటు చెప్పాడు దేవుడు.
కానీ మన వెంగల్ అన్నిటినీ నిరాకరించడంతో ఇలా అడిగాడు నేను నీకు ఏం ఇవ్వలేదు అని తిట్టుకోవడం చూసి నేనే బిక్షగాడి రూపంతో వచ్చాను అని దేవుడీ రూపం లో కనిపించి ఇలా చెప్పారు.
నీకు లక్షలు ఇస్తాను అన్నా కూడా నీవు నీ శరీరం లో ఏ అవయవాలు ఇవ్వలేదు అంటే లక్షల ఆస్తి నీకు నేను ఇచ్చినట్లే కదా మరి ఏందుకు ఇచ్చిన ఆస్తి నీ కాకుండా ఇంకా కావాలంటవు?
నేను మీ ఇంటి ముందు ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఏం ఇవ్వలేదు వాళ్ళకి కూడా నీలాగే శరీరం ఆవయావాలు ఇచ్చాను అంతే వాళ్ళు కష్టపడి పని చేసి ఆవయావాలు ఆవకాషాలు వినియోగించుకుని లక్షదికారులు ఆయ్యారు.నీవు మాత్రం నా పూజలు చేస్తు కుర్చున్నావు మరి ఏలా ప్రయోజకుడివి అవుతావ్ అని అడిగాడు.
వెంగల్ తెలివి తెచ్చుకుని దేవుడుని క్షమించమని అడిగి కష్టపడి పని చేసి త్వరలోనే లక్షదికారి అయ్యాడు.

Monday, July 18, 2016

శాసన మండలి మరియు శాసన సభ లో హరితహారం

శాసన మండలి మరియు శాసన సభ లో హరితహారం కార్యక్రమంలో పాల్గున్న స్పీకర్, డెప్యూటీ స్పీకర్ మరియు చైర్మన్ మరియు డెప్యూటీ చైర్మన్ 








చెరుకుపల్లి గ్రామం, నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన డెప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు

చెరుకుపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన
డెప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు తన స్వంత గ్రామం లో హరితహారాన్ని ప్రారంభించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు 


Monday, July 4, 2016

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.



నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. 
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన బాలాలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. కేవలం క్యూలైన్ల నిర్మాణాలు జరిగితే భక్తులు వరుసలో వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు మరింత వసతి చేకూరుతుంది. 
గుట్టపై చేపట్టనున్న నిర్మాణాల కోసం ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే పనులకు శ్రీకారం చుట్టారు. 
ఈ ప్రక్రియ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏ నిర్మాణాలు జరపవలసి ఉందో ఆయా నిర్మాణాలను ఆరంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 
ప్రహరీ గోడ నిర్మించేందుకు వీలుగా పునాదుల తవ్వకం ఆరంభ మైందని తెలిపారు. కాగా, ప్రస్తుతం కొండపైన 108 దుకాణాలు ఉండగా, వీటి స్థానంలో తాత్కాలిక ఏర్పాట్ల తో దుకాణదారులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 
అయితే శాశ్వతంగా దుకాణాలు వరుస క్రమంలో నిర్మిస్తారా లేక తిరుమల తిరుపతి తరహాలో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారా అన్న విషయంలో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని తెలుస్తుంది.
శిల్పనిర్మాణాల కోసం గతంలో హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన ‘తధాగతుని’ విగ్రహాన్ని తొలిచిన రాయ గిరి కొండనుంచే కావలసిన రాయిని సేకరించేందుకు నిర్ణయించి ఈ మేరకు పనులను త్వరలో ఆరంభించనున్నారు. 
ఇక ప్రధాన ఆలయమైన గుట్టకు చుట్టూ ఉన్న గుట్టలపై దశావతార మూర్తులను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్న మేరకు పెద్ద గుట్ట కొండపై పనులు ఆరంభించినట్లు చెప్పారు. 
దీంతోపాటు గుట్ట చుట్టూరా వలయ రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మేరకు ఆ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే నిర్మాణ పనులకు కూలీల కొరత అధికంగా ఉండడంతో పనులు అనుకున్న మేరకంటే కొంత ఆలస్యమవుతున్నాయంటున్నారు. ఇక రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఏర్పాటు చేయనున్న నాలుగు వరుసల రహదారి పనులు కొంత నత్తనడకన నడుస్తున్నాయని చెబుతున్నారరు. 
ఇప్పటికే స్థల సేకరణ పూర్తి కాగా, రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గానీ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదంటున్నారు. 
ఇప్పటికే విస్తరణ కోసం పలు దఫాలుగా ఇళ్ళను కోల్పోతున్న బాధిత ప్రజలతో సమా వేశాలు నిర్వహించామని, ఇంకా పరిహారం తదితర విషయాలు ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని, నిర్మాణ పనులు ఊపందు కుంటే దేవుడిని దర్శించుకోవడంతో పాటు ఈ నిర్మా ణాలను వీక్షించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటు న్నారు. 
నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యా లయం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి తిరుపతి వెళ్ళే భక్తులకు ఇక్కడి నుంచే పలు సేవల టిక్కెట్లు అందిస్తున్నారు. 
అదే మాదిరిగా యాదాద్రికి వెళ్ళే భక్తులకు బస, దర్శనం తదితర అవసరాలు తీర్చేందుకు గాను వైటిడిఎ బర్కత్‌పురలో ఒక కార్యా లయ నిర్మా ణాన్ని చేపట్టగా ఆ భవన నిర్మాణ పనులు కూడా వేగవం తంగా జరుగుతున్నాయని, త్వరలో మొత్తం యాదాద్రికి చెందిన ప్రతి పనిని ఇక వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

Tuesday, June 21, 2016

వాట్సాప్లోఇంకా చాలామందికి తెలియని కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటో.. ఎలా వాడాలోఓ లుక్కేద్దాం

స్మార్ట్ఫోన్ వినియోగదారులంతానిత్యం వాడే యాప్లలో వాట్సాప్ ఒకటి. స్నేహితులు.. కుటుంబం సభ్యులు..సహోద్యోగులతో ఛాటింగ్కు ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్నే వాడుతున్నారు.ఆఖరికి ప్రభుత్వ ఉన్నతాధికారులు.. మంత్రులు క్షేత్రస్థాయిలో పనులుఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కూడావాట్సాప్ గ్రూపులను వాడుతుండటం విశేషం. ఇలా అందరూ వాడుతున్న వాట్సాప్లోఇంకా చాలామందికి తెలియని కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటో.. ఎలా వాడాలోఓ లుక్కేద్దాం.
1. మెసేజ్లకుమెరుపులుఅందరూ మెసేజ్లనుమామూలుగా టైప్ చేసి పంపిస్తుంటారు. కానీ.. ఆ మెసేజ్లలో కొన్ని సింబల్స్నువాడటం ద్వారా ఆకట్టుకునేలా మార్చేయొచ్చు. ఎలా అంటే..* మెసేజ్లోముఖ్యమైన పదాలను బోల్డ్ లెటర్స్లో రాస్తే ఎదుటి వ్యక్తి తేలిగ్గా గుర్తించగలరు.అందుకోసం ఆ పదాన్ని రెండు స్టార్(*)ల మధ్య టైప్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు:*ఎలా ఉన్నారు?**ఇటాలిక్ లుక్లోకిమెసేజ్లను.. అందులో కొన్ని పదాలను మార్చేందుకు అండర్స్కోర్(_ను)వాడాలి. ఉదాహరణకు: _హలో_* ఏదైనా పదాన్నితప్పు అని చెప్పడానికి.. దాన్ని అడ్డంగా కొట్టివేసేందుకు నెగేషన్(~)నువాడాలి. ఉదాహరణకు: ~హాయ్~* ఈ గుర్తులనుఒకటికంటే ఎక్కువ కూడా వాడొచ్చు. ఉదాహరణకు: ఒకే పదాన్ని బోల్డ్ఇటాలిక్గామార్చేయాలంటే: *_హలో_*అని టైప్ చేయాలి.
2. స్నేహితులుపంపే ప్రతి ఫొటో.. వీడియో ఫోన్లోకి అటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటేఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సెట్టింగ్స్లోని‘చాట్ ఆప్షన్’ను ఎంచుకుని అందులో ‘సేవ్ ఇన్కమింగ్ మీడియా’ను టర్న్ఆఫ్చేస్తే చాలు.
3. మనం పంపినమెసేజ్ను ఎదుటి వ్యక్తి.. లేదా గ్రూపులోని సభ్యులు ఎవరు ఎప్పుడు చదివారోతెలుసుకోవచ్చు. అందుకు ఆ మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేసి కుడివైపుపైన మెనూలో ‘ఇన్ఫో’ను క్లిక్ చేస్తే చాలు. పంపిన మెసేజ్ ఎవరి ఫోన్కుఏ సమయానికి డెలివరీ అయ్యింది? దాన్ని ఎప్పుడు చదివారో తెలిసిపోతుంది. ఈసదుపాయం పాత వెర్షన్లలో లేదు.
4. ఎవరి కోసంఎక్కువ డాటాను ఖర్చు చేస్తున్నాం? వాట్సాప్లో అధిక సమయం ఎవరికి కేటాయిస్తున్నాం?ఎవరికి ఎక్కువ మెసేజ్లు పంపాం? వంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అందుకోసంసెట్టింగ్స్లోని అకౌంట్ ట్యాబ్లో ‘స్టోరోజీ యూసేజ్’లోకి వెళ్లాలి. ప్రస్తుతం ఐఓఎస్వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది.
5. పనిలో బిజీగాఉన్నప్పుడు గ్రూపులలో మెసేజ్లు రాకుండా ఆపేయొచ్చు. అందుకోసం ఆ గ్రూపుపేరుపై క్లిక్ చేసి ‘మ్యూట్’ చేసే వీలుంది. అందులో 8 గంటలు.. వారం రోజులు..1 సంవత్సరం అని ఎంతకాలం మ్యూట్ చేయాలనుకుంటున్నామో ఎంచుకోవాలి.అలాగే.. మెసేజ్ అలర్ట్ శబ్దాలను కూడా ఆపేసుకోవచ్చు. అందుకు వాట్సాప్సెట్టింగ్స్లో ‘నోటిఫికేషన్స్’లోకి వెళ్లి నిలిపివేయొచ్చు.
6. ముఖ్యమైనవ్యక్తులను ప్రతిసారీ చాట్ లిస్ట్లో వెతకాల్సిన పనిలేకుండా ఫోన్ హోమ్స్క్రీన్పైనే వాళ్ల ఖాతాకు సంబంధించిన షార్ట్కట్ను పెట్టేసుకోవచ్చు.దానిపై క్లిక్ చేస్తే నేరుగా వాట్సాప్లోని ఆ వ్యక్తి సంభాషణ ఓపెన్ అవుతుంది.ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్లో మాత్రమే ఉంది.
7. గతంలో ఫొటోలు..ఆడియో.. వీడియోలు మాత్రమే షేర్ చేసుకునే వీలుండేది. కానీ.. తాజా వెర్షన్లలోవర్డ్ డాక్యుమెంట్లు.. పీడీఎఫ్ ఫైళ్లను కూడా పంపే సదుపాయం ఉంది.అలాగే మనం ఎక్కడున్నామో మ్యాప్ లొకేషన్ను కూడా పంపొచ్చు.
8. మెసేజ్లోవారం పేరు తేదీని టైప్ చేయగానే అది హైపర్లింక్గా మారిపోతుంది. దానిపైక్లిక్ చేసి క్యాలెండర్లో ముఖ్యమైన ఈవెంట్స్ను షెడ్యూల్ చేసుకోవచ్చు.ఈ సదుపాయం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.ఇలా ఎప్పుడూమనకు తెలియకుండా ప్రతి వెర్షన్లోనూ కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకివస్తూనే ఉన్నాయి.

Sunday, May 1, 2016

నన్ను బాల్యం నుండి ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉండేది.....


నన్ను బాల్యం నుండి ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉండేది......
ఇంట్లో, గుడిలో దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా అనే ప్రశ్న .... ? నన్నెప్పటినుండో వేధిస్తుండేది...... బాల్యం లో ఎన్నోసార్లు దేవుడు నైవేద్యాన్ని స్వీకరించేటప్పుడు చూడాలని దేవుడి గది వద్ద వేచిచూసే వాణ్ణి.... ... భయం తో పెద్దవాళ్ళని అడిగినా, అప్పటి నా మనస్థితి వల్లనో ఏమో ... వాళ్ళ సమాధానం నాకు రుచించేది కాదు.....
నైవేద్యం గూర్చి, ఈ మధ్య ఒక సందర్భం లో ఒక గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణ ద్వారా నాకు బోధపడేలా చేయడం జరిగింది.
ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటుండేవారు, వారిలో ఒక పిల్లవాడికి ఇదే విధమయిన సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.