Monday, July 18, 2016
Monday, July 4, 2016
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట (యాదాద్రి) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన బాలాలయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. కేవలం క్యూలైన్ల నిర్మాణాలు జరిగితే భక్తులు వరుసలో వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు మరింత వసతి చేకూరుతుంది.
గుట్టపై చేపట్టనున్న నిర్మాణాల కోసం ప్రస్తుతం ఉన్న పాత నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రక్రియ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏ నిర్మాణాలు జరపవలసి ఉందో ఆయా నిర్మాణాలను ఆరంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రహరీ గోడ నిర్మించేందుకు వీలుగా పునాదుల తవ్వకం ఆరంభ మైందని తెలిపారు. కాగా, ప్రస్తుతం కొండపైన 108 దుకాణాలు ఉండగా, వీటి స్థానంలో తాత్కాలిక ఏర్పాట్ల తో దుకాణదారులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
అయితే శాశ్వతంగా దుకాణాలు వరుస క్రమంలో నిర్మిస్తారా లేక తిరుమల తిరుపతి తరహాలో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారా అన్న విషయంలో ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని తెలుస్తుంది.
శిల్పనిర్మాణాల కోసం గతంలో హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన ‘తధాగతుని’ విగ్రహాన్ని తొలిచిన రాయ గిరి కొండనుంచే కావలసిన రాయిని సేకరించేందుకు నిర్ణయించి ఈ మేరకు పనులను త్వరలో ఆరంభించనున్నారు.
ఇక ప్రధాన ఆలయమైన గుట్టకు చుట్టూ ఉన్న గుట్టలపై దశావతార మూర్తులను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయం తీసుకున్న మేరకు పెద్ద గుట్ట కొండపై పనులు ఆరంభించినట్లు చెప్పారు.
దీంతోపాటు గుట్ట చుట్టూరా వలయ రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మేరకు ఆ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే నిర్మాణ పనులకు కూలీల కొరత అధికంగా ఉండడంతో పనులు అనుకున్న మేరకంటే కొంత ఆలస్యమవుతున్నాయంటున్నారు. ఇక రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ఏర్పాటు చేయనున్న నాలుగు వరుసల రహదారి పనులు కొంత నత్తనడకన నడుస్తున్నాయని చెబుతున్నారరు.
ఇప్పటికే స్థల సేకరణ పూర్తి కాగా, రోడ్డు నిర్మాణం పూర్తి అయితే గానీ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదంటున్నారు.
ఇప్పటికే విస్తరణ కోసం పలు దఫాలుగా ఇళ్ళను కోల్పోతున్న బాధిత ప్రజలతో సమా వేశాలు నిర్వహించామని, ఇంకా పరిహారం తదితర విషయాలు ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని, నిర్మాణ పనులు ఊపందు కుంటే దేవుడిని దర్శించుకోవడంతో పాటు ఈ నిర్మా ణాలను వీక్షించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటు న్నారు.
నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యా లయం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి తిరుపతి వెళ్ళే భక్తులకు ఇక్కడి నుంచే పలు సేవల టిక్కెట్లు అందిస్తున్నారు.
అదే మాదిరిగా యాదాద్రికి వెళ్ళే భక్తులకు బస, దర్శనం తదితర అవసరాలు తీర్చేందుకు గాను వైటిడిఎ బర్కత్‌పురలో ఒక కార్యా లయ నిర్మా ణాన్ని చేపట్టగా ఆ భవన నిర్మాణ పనులు కూడా వేగవం తంగా జరుగుతున్నాయని, త్వరలో మొత్తం యాదాద్రికి చెందిన ప్రతి పనిని ఇక వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు పనుల్లో వేగం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
Tuesday, June 21, 2016
వాట్సాప్లోఇంకా చాలామందికి తెలియని కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటో.. ఎలా వాడాలోఓ లుక్కేద్దాం
స్మార్ట్ఫోన్ వినియోగదారులంతానిత్యం వాడే యాప్లలో వాట్సాప్ ఒకటి. స్నేహితులు.. కుటుంబం సభ్యులు..సహోద్యోగులతో ఛాటింగ్కు ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్నే వాడుతున్నారు.ఆఖరికి ప్రభుత్వ ఉన్నతాధికారులు.. మంత్రులు క్షేత్రస్థాయిలో పనులుఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కూడావాట్సాప్ గ్రూపులను వాడుతుండటం విశేషం. ఇలా అందరూ వాడుతున్న వాట్సాప్లోఇంకా చాలామందికి తెలియని కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటో.. ఎలా వాడాలోఓ లుక్కేద్దాం.
1. మెసేజ్లకుమెరుపులుఅందరూ మెసేజ్లనుమామూలుగా టైప్ చేసి పంపిస్తుంటారు. కానీ.. ఆ మెసేజ్లలో కొన్ని సింబల్స్నువాడటం ద్వారా ఆకట్టుకునేలా మార్చేయొచ్చు. ఎలా అంటే..* మెసేజ్లోముఖ్యమైన పదాలను బోల్డ్ లెటర్స్లో రాస్తే ఎదుటి వ్యక్తి తేలిగ్గా గుర్తించగలరు.అందుకోసం ఆ పదాన్ని రెండు స్టార్(*)ల మధ్య టైప్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు:*ఎలా ఉన్నారు?**ఇటాలిక్ లుక్లోకిమెసేజ్లను.. అందులో కొన్ని పదాలను మార్చేందుకు అండర్స్కోర్(_ను)వాడాలి. ఉదాహరణకు: _హలో_* ఏదైనా పదాన్నితప్పు అని చెప్పడానికి.. దాన్ని అడ్డంగా కొట్టివేసేందుకు నెగేషన్(~)నువాడాలి. ఉదాహరణకు: ~హాయ్~* ఈ గుర్తులనుఒకటికంటే ఎక్కువ కూడా వాడొచ్చు. ఉదాహరణకు: ఒకే పదాన్ని బోల్డ్ఇటాలిక్గామార్చేయాలంటే: *_హలో_*అని టైప్ చేయాలి.
2. స్నేహితులుపంపే ప్రతి ఫొటో.. వీడియో ఫోన్లోకి అటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటేఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సెట్టింగ్స్లోని‘చాట్ ఆప్షన్’ను ఎంచుకుని అందులో ‘సేవ్ ఇన్కమింగ్ మీడియా’ను టర్న్ఆఫ్చేస్తే చాలు.
3. మనం పంపినమెసేజ్ను ఎదుటి వ్యక్తి.. లేదా గ్రూపులోని సభ్యులు ఎవరు ఎప్పుడు చదివారోతెలుసుకోవచ్చు. అందుకు ఆ మెసేజ్పై లాంగ్ ప్రెస్ చేసి కుడివైపుపైన మెనూలో ‘ఇన్ఫో’ను క్లిక్ చేస్తే చాలు. పంపిన మెసేజ్ ఎవరి ఫోన్కుఏ సమయానికి డెలివరీ అయ్యింది? దాన్ని ఎప్పుడు చదివారో తెలిసిపోతుంది. ఈసదుపాయం పాత వెర్షన్లలో లేదు.
4. ఎవరి కోసంఎక్కువ డాటాను ఖర్చు చేస్తున్నాం? వాట్సాప్లో అధిక సమయం ఎవరికి కేటాయిస్తున్నాం?ఎవరికి ఎక్కువ మెసేజ్లు పంపాం? వంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అందుకోసంసెట్టింగ్స్లోని అకౌంట్ ట్యాబ్లో ‘స్టోరోజీ యూసేజ్’లోకి వెళ్లాలి. ప్రస్తుతం ఐఓఎస్వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది.
5. పనిలో బిజీగాఉన్నప్పుడు గ్రూపులలో మెసేజ్లు రాకుండా ఆపేయొచ్చు. అందుకోసం ఆ గ్రూపుపేరుపై క్లిక్ చేసి ‘మ్యూట్’ చేసే వీలుంది. అందులో 8 గంటలు.. వారం రోజులు..1 సంవత్సరం అని ఎంతకాలం మ్యూట్ చేయాలనుకుంటున్నామో ఎంచుకోవాలి.అలాగే.. మెసేజ్ అలర్ట్ శబ్దాలను కూడా ఆపేసుకోవచ్చు. అందుకు వాట్సాప్సెట్టింగ్స్లో ‘నోటిఫికేషన్స్’లోకి వెళ్లి నిలిపివేయొచ్చు.
6. ముఖ్యమైనవ్యక్తులను ప్రతిసారీ చాట్ లిస్ట్లో వెతకాల్సిన పనిలేకుండా ఫోన్ హోమ్స్క్రీన్పైనే వాళ్ల ఖాతాకు సంబంధించిన షార్ట్కట్ను పెట్టేసుకోవచ్చు.దానిపై క్లిక్ చేస్తే నేరుగా వాట్సాప్లోని ఆ వ్యక్తి సంభాషణ ఓపెన్ అవుతుంది.ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్లో మాత్రమే ఉంది.
7. గతంలో ఫొటోలు..ఆడియో.. వీడియోలు మాత్రమే షేర్ చేసుకునే వీలుండేది. కానీ.. తాజా వెర్షన్లలోవర్డ్ డాక్యుమెంట్లు.. పీడీఎఫ్ ఫైళ్లను కూడా పంపే సదుపాయం ఉంది.అలాగే మనం ఎక్కడున్నామో మ్యాప్ లొకేషన్ను కూడా పంపొచ్చు.
8. మెసేజ్లోవారం పేరు తేదీని టైప్ చేయగానే అది హైపర్లింక్గా మారిపోతుంది. దానిపైక్లిక్ చేసి క్యాలెండర్లో ముఖ్యమైన ఈవెంట్స్ను షెడ్యూల్ చేసుకోవచ్చు.ఈ సదుపాయం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.ఇలా ఎప్పుడూమనకు తెలియకుండా ప్రతి వెర్షన్లోనూ కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకివస్తూనే ఉన్నాయి.
Sunday, May 1, 2016
నన్ను బాల్యం నుండి ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉండేది.....
నన్ను బాల్యం నుండి ఒక ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూ ఉండేది......
ఇంట్లో, గుడిలో దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా అనే ప్రశ్న .... ? నన్నెప్పటినుండో వేధిస్తుండేది...... బాల్యం లో ఎన్నోసార్లు దేవుడు నైవేద్యాన్ని స్వీకరించేటప్పుడు చూడాలని దేవుడి గది వద్ద వేచిచూసే వాణ్ణి.... ... భయం తో పెద్దవాళ్ళని అడిగినా, అప్పటి నా మనస్థితి వల్లనో ఏమో ... వాళ్ళ సమాధానం నాకు రుచించేది కాదు.....
నైవేద్యం గూర్చి, ఈ మధ్య ఒక సందర్భం లో ఒక గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణ ద్వారా నాకు బోధపడేలా చేయడం జరిగింది.
ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటుండేవారు, వారిలో ఒక పిల్లవాడికి ఇదే విధమయిన సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.
Saturday, April 30, 2016
ఉత్తములకీ మనకీ తేడా !
చరిత్రలో ఆవిష్క్రతమైన అద్భుత సంఘటన
ఉత్తములకీ మనకీ తేడా !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన ౠసొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు 💥. చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.
Friday, April 29, 2016
ఆఫీసుల్లో కొలీగ్‌లు, బాస్‌లు చేసే రాజకీయాలకు చెక్ పెట్టేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటి..?
ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే? అప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పాడు. వాటిని పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరి, ఆ చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా!
1. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది. దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి. దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే. అలా చేస్తేనే వారిపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
2. మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు, సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
3. ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. అలా చేస్తే దాని వల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దాని వల్ల లబ్ది పొందుతారు.
4. శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్ర్తాలను ప్రయోగిస్తారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
5. శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు.
6. ఎక్కడ, ఏ సందర్భంలోనైనా మనం మంచి నడవడిక, ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం.
7. మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఒక వేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు కనుక, మన విలువైన మాటలు వృథాగా పోతాయి. అంతే తప్ప, పెద్దగా ఫలితం ఉండదు.
8. పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది కానీ మనతో మంచిగా ఉండదు కదా! అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎల్లప్పటికీ చెడే తలపెడతారు. ఎందుకంటే వారికి చెడు చేయడంలోనే తృప్తి లభిస్తుంది.
Subscribe to:
Posts (Atom)











