Friday, September 4, 2015
సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నా ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు చెస్తారు.....
- రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే హైస్కూలు చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
- మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
- ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్.
- 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.
- రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.
- రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
- రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
Tuesday, September 1, 2015
మన సర్దార్జీ Vs అమెరికా బిల్ గేట్స్
మన సర్దార్జీ అమెరికా వెళ్లి బిల్ గేట్స్ తో మీటింగ్ లో
పాల్గొన్నాడు
.
మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు
చూపిస్తా రా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు
.
"ఇక్కడ గొయ్యి తవ్వు", సర్దార్జీ అలాగే తవ్వాడు...
"ఇంకా లోతుకి తవ్వు" అంటూ వంద
అడుగులు గొయ్యి తీయించాడు. "ఇప్పుడు
.
వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు
సర్దార్జీ వెతికితే ఒక వైరు దొరికింది
"చూసావా వంద ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్
వాడాము అన్నదానికి ఇది రుజువు"
.
సర్దార్జీ కి వళ్ళు మండింది,
తమాయించుకున్నాడు
.
ఆ తరువాత బిల్ గేట్స్ మన ఇండియా కి వచ్చాడు,
అప్పుడు మన సర్దార్జీ గేట్స్ ని కలిసి మా దేశం
గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి
తీసుకెళ్ళాడు
.
"అక్కడ గొయ్యి తీయమన్నాడు.. గేట్స్ అలాగే గొయ్యి
తీసాడు, "ఇంకా లోతు ఇంకా లోతు" అంటూ
అయిదు వందల అడుగులు లోతు తీయించాడు.
.
"ఇప్పుడు వెతుకు ఏదైనా దొరుకుతుందేమో"
అన్నాడు
.
పాపం ఎంత వెతికినా గేట్స్ కి ఏమీ దొరకలేదు..
.
.
.
.
.
వెంటనే మన సర్దార్జీ "చూసావా అయిదు వందల
ఏళ్ల క్రితమే మా వాళ్లు వైర్ లెస్ టెక్నాలజీ వాడారు"
అన్నాడు గర్వంగా
దిమ్మతిరిగి పోయింది బిల్ గేట్స్ కు
indian rocks
ఒక్క మనిషి ఇవిదమైన ఆహరం తీసుకోవడం వల్లనా ఆరోగ్యంగా ఉంటాడు...
అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🍎కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🍎నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🍎గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🍎 అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🍎జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🍎బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🍎సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍎మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🍎దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🍎ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🍎అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🍎కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🍎 మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🍎ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🍎బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🍎క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🍎 మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🍎ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🍎అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍎 పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🍎సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🍎దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🍎ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🍎చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🍎కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🍎క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🍎వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🍎పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
🍎ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🍎ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🍎ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🍎జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🍎నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🍎మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🍎మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.....!!!!!
మనసున్న దొంగ..
తల్లి వైద్యం కోసం దొంగతనం చేసి, తల్లి మృతి చెందడంతో దొంగతనం చేసిన డబ్బు తిరిగిచ్చేసి కటకటాలపాలయ్యాడో దొంగ. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఆగస్టు 24న చెన్నైలోని పుదుక్కొట్టై పెరియార్ నగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వాధికారి రాజమాణిక్యం.. బ్యాంకు నుంచి రూ. 5లక్షలు డ్రా చేసి, భార్య కాత్యాయనికి ఇచ్చి బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో అటుగా వచ్చిన మన్సూర్, మంచినీళ్లు కావాలని కాత్యాయనిని అడిగాడు. మంచినీళ్లు తెచ్చి ఇచ్చేందుకు ఆమె వంటగదిలోకి వెళ్లగానే, అక్కడే వున్న డబ్బుల బ్యాగు తీసుకుని మన్సూర్ ఉడాయించాడు.
లబోదిబోమంటూనే ఆమె తన భర్త రాజమాణిక్యంకు ఫోన్ చేసి విషయం వివరించింది. దీంతో దంపతులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో 26న రాజమాణిక్యం ఇంటికి చేరుకున్న మన్సూర్, తన తల్లికి అనారోగ్యం కారణంగా, వైద్యం చేయించుకునే స్తోమతలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అయినప్పటికీ తన తల్లి బ్రతకలేదని, వైద్యానికి 50 వేల రూపాయలు ఖర్చయ్యాయని, ఖర్చైన డబ్బుకు ప్రతిగా తన ద్విచక్రవాహనం ఉంచుకోవాలని ఆ దంపతులకు చెప్పి, 4.5 లక్షల రూపాయలున్న బ్యాగు అక్కడ వదిలేసి పరుగుపెట్టాడు.
దీంతో వారు చుట్టుపక్కలవారి సహాయంతో మన్సూర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విరాలీమలైకి చెందిన మన్సూర్ తిరుచ్చిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు.
గణేశ్ మండపాల ఏర్పాటు దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో చేసుకోవచు.
హైదరాబాద్ :గణేశ్ మండపాల ఏర్పాటు దరఖాస్తు ఫారాలు హైదరాబాద్ పోలీస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అయితే, వీటితో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. గతేడాది దరఖాస్తు చేసుకున్న ఫారాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచారని సోమవారం ఆయన విలేకరులకు చెప్పారు.
http://www.hyderabadpolice.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్న అసోసియేషన్ ఫారాలు కూడా ఉంటాయి. అదే అసోసియేషన్ పేరుతో ఈ ఏడాది కూడా దరఖాస్తు చేసుకుంటే దానిని డౌన్‌లోడ్ చేసుకొని కావాల్సిన మార్పులు చేసి కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది.
ఇక గ్రామాల్లో వినాయకుడు మండపాల కొరకు మండల పోలీస్ స్టేషన్ లలో ముందస్తు దరఖాస్తు చేస్కోవలెను
please click on G + button which is on top or right side on amazon ad.. for follow us
ఇక గ్రామాల్లో వినాయకుడు మండపాల కొరకు మండల పోలీస్ స్టేషన్ లలో ముందస్తు దరఖాస్తు చేస్కోవలెను
please click on G + button which is on top or right side on amazon ad.. for follow us
Subscribe to:
Posts (Atom)




